ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే చాలా అందంగా ఉండాలి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అందం రెట్టింపు చేసుకోవడం కోసం సినిమా సెలబ్రిటీలందరూ కూడా సర్జరీలు చేయించుకుంటూ మరింత రెట్టింపు అందాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు సర్జరీలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నటి అనుష్క సైతం సర్జరీకి సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. మరి అనుష్క ఏ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతుంది అనే విషయానికి వస్తే… గత కొద్దిరోజులుగా మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతున్నారట అయితే పలువురు డాక్టర్లను సంప్రదించగా మోకాలికి చిన్న సర్జరీ అవసరమని చెప్పడంతో ఈమె సర్జరీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సర్జరీ విదేశాలలో చేయించుకోబోతున్నారట.

ఇలా సర్జరీ కారణంగా అనుష్క కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఈమె కొన్ని నెలల పాటు సినిమాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని అందుకే ఈమె కమిట్ అయినటువంటి సినిమాలకు తీసుకున్నటువంటి అడ్వాన్స్ కూడా వెనక్కి ఇస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అనుష్క గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇది మాత్రం వైరల్ అవుతుంది.