త్రిషకు సపోర్ట్ గా ఆ కామాంధుడికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.

త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటులేదు. ఇలా మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడలని, మహిళలకు మద్దతుగా నిలబడాలని సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను అని నితిన్ తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నితిన్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ట్వీట్ చేశారు.

చిరంజీవి తన ట్వీట్ లో.. త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ స్త్రీని అనడానికి అయినా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్ గా నిలబడతాను అని ట్వీట్ చేశారు. చిరంజీవి, త్రిష స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. ఇప్పటికే మన్సూర్ అలీఖాన్ పై తీవ్ర చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

అయితే దీనిపై మన్సూర్ కూడా స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. మన్సూర్ త్రిష వివాదంపై స్పందిస్తూ.. ఈ వీడియో గురించి నా ఫ్యామిలీ ద్వారానే విన్నాను. నేను పూర్తిగా మాట్లాడింది చూడకుండా అక్కడి వరకు మాత్రమే కట్ చేసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నాకు కూడా కూతుళ్లు ఉన్నారు. నా కూతురు లియో సినిమా ఓపెనింగ్ కి వచ్చి త్రిషతో మాట్లాడింది. నాపై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎన్ని సేవ కార్యక్రమాలు చేశానో, నేను ఎలాంటివాడినో తమిళ ప్రజలకు తెలుసు. నా గురించి ప్రశ్నించనవసర్లేదు అని సమాధానమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *