వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో అన్నా చెల్లెలి మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం అవుతోంది. గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పినట్లు అభిప్రాయ భేదాలు తప్ప విభేదాలు ఏమి లేవని తేలిపోయింది. అందరూ ఇడుపులపాయలో జరిగే ప్రార్థనల్లో పాల్గొనే వాళ్లు.
కానీ వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలు కారణంగా వేర్వేరుగా వచ్చి నివాళి అర్పిస్తున్నారు. గతేడాది ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ఒకటిగానే వచ్చినా వేర్వేరుగానే ఉన్నారు. ఈసారి మాత్రం ఉదయం షర్మిల వచ్చి వెళ్లిపోయిన తర్వాత జగన్ వస్తున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయచేరుకొని తండ్రి సమాధికి నివాళి అర్పించనున్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంక టీంతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. పదే పదే వీటిని ఆమె ఖండిస్తున్నా తరచూ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఈ పుకార్లకు ఊతమిస్తున్నాయి. మొత్తానికి ఈ విషయంపై ఇవాళ ఏదో ఒకటి తేల్చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.