తనకున్న ఇమేజ్ ని జనాలు మర్చిపోకుండా జాగ్రత్త పడుతుంది. ఏదో విధంగా జనాల నోళ్ళలో నానాలి, ఫోకస్ లో ఉండాలనే తాపత్రయం ఆమెలో కనిపిస్తుంది. పచ్చి బూతులు పబ్లిక్ లో మాట్లాడేయగల తెగింపు శ్రీరెడ్డి సొంతం. అయితే జగనన్నకు నమస్కారం.. మేము కొన్ని రోజులుగా ఒక నష్టాన్ని అనుభవిస్తున్నాం.
మా త్యాగాలు మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడిమోను చేస్తున్నాం. మీరు అర్ధం చేసుకోవాలి. ఆంధ్రా సీఎం ఆఫీస్‌కు, ఏపీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి ఈ సందేశం వెళ్లాలి. పార్టీలో నాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించడానికి వారి అందరి తరఫున వైఎస్ఆర్సీపీ కోసం నేను, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు గట్టిగా పనిచేస్తునాం అని శ్రీరెడ్డి తన వీడియోలో తెలిపారు. అయితే కొంతమంది ప్రవర్తన మాకు నచ్చడం లేదు.
వాళ్లు మా పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను యూట్యూబర్‌గా ఉన్నప్పుడు ఆదాయం ఉండేది. మిమ్మల్ని, మీ పార్టీని పొగడటం మొదలుపెట్టిన తర్వాత.. మీ ఎమ్మెల్యేలు, ఎంపీల తరఫున మాట్లాడిన తర్వాత మా రిపోర్టుల కొట్టేసి మా జీవనాధారంపై దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు అని శ్రీరెడ్డి తెలిపారు.