పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మహేష్ బాబు, వెంకటేష్. ఇదిగో సాక్ష్యం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని ఎలాగైనా వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వరుసగా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

వీటిలో నేషనల్ వైడ్‌గా పేరు ఉన్న సంస్థలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన కమర్షియల్ యాడ్స్‌లో ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు ఎక్కువగా నటిస్తున్నాడు. తద్వారా ఫుల్లుగా సంపాదిస్తూ దూసుకుపోతోన్నాడు. తాజాగా మహేష్ బాబు బడా కంపెనీ ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్ ఈవెంట్ కి హాజరు అయ్యారు. ఇందులో పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా పేకాట ఆడుతూ కనిపించారు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ సరదాగా పేకాట ఆడుతుండగా ఎవరో ఫోటోలు తీశారు. అంతేకాదు వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసి చిన్నోడు పెద్దోడు పేకాట ఆడుతున్నారు అని క్యాప్షన్ పెట్టారు. ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇద్దరు స్టార్ హీరోని పేకాట ఆడుతూ కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *