ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది ఈ భామ. అయితే ఒక సినీ నటుడు చనిపోతాడని వేణు స్వామి చెప్పినట్టుగానే హీరో తారకరత్న మృతి చెందారు. విచిత్రం ఏంటంటే ఓ యంగ్ హీరో చనిపోతాడు అంటూ వేణు స్వామి తారకరత్న మరణాన్ని ముందే ఊహించారు.
ఇక ప్రభాస్ సినిమాల గురించి ఆయన చెప్పినట్టుగానే జరుగుతోంది. అలాగే రాంచరణ్ కి పుట్టే పిల్లల గురించి కూడా ఎప్పుడు ? పుడతారు అనేది వేణు స్వామి ముందే చెప్పారు. అలాగే త్వరలోనే ఒక హీరో, ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటారని వేణు స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి నిజం కాబోతున్నాయి. వేణు స్వామి ఆ మాటలు చెప్పిన వెంటనే టాలీవుడ్ లో ఆ హీరో హీరోయిన్ ఎవరబ్బా ? అని ప్రతి ఒక్కరూ తెగ ఆలోచనలో పడిపోయారు.
ఇప్పుడు వేణుస్వామి మాటకు తగ్గట్టుగానే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. దీంతో వేణు స్వామి చెప్పిన మాటలు మరోసారి నిజం అయ్యాయి.