ఉపాసన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ జననం మెగా ఫ్యామిలీలో ఎనలేని ఆనందాన్ని, వేడుకలను తెచ్చిపెట్టింది. మెగా ప్రిన్సెస్ రాకను అత్యుత్సాహంతో సంబరాలు చేసుకున్నారు చిరంజీవి, సురేఖ. ఒక ప్రత్యేక వేడుకలో, రామ్ చరణ్ మరియు ఉపాసన తమ కుమార్తెకు క్లింకర కొణిదెల అని పేరు పెట్టారు,
అయితే ముఖ్యంగా మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్ రాకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు రామ్ చరణ్- దంపతులు. కాగా చాలామంది సెలబ్రిటీల్లాగే ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు. అందుకే తమ లిటిల్ ప్రిన్స్ ముఖాన్ని ఇంతవరకు చూపించలేదు. మరోవైపు క్లింకారను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే రామ్ చరణ్ దంపతులు మాత్రం తమ కూతురు ప్రైవసీ విషయంలో దృఢ నిశ్చయంతో ఉన్నారని అందుకే తన ఫొటోలు బయటకు రానివ్వడం లేదంటూ తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూతురంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయి. నిజమిదే.. అయితే ఇవి రియల్ ఫొటోలు కాదు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొందరు క్లింకార ఫొటోలను అద్బుతంగా డిజైన్ చేస్తున్నారు. అలా రామ్ చరణ్ చేతుల్లో బేబీ ఉన్న ఏఐ ఫొటో ఒకటి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.