సోషల్ మీడియాలో అందాల గాలం వేయడంలో మొదటి స్థానంలో ఉంటోంది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఆమె షేర్ చేసిన ప్రతి ఫోటో షూట్ కూడా కుర్రకారు గుండె వేగాన్ని పెంచేస్తోంది. అందాల నిధి చూపిస్తూ గ్లామర్ ట్రేట్ ఇస్తుండటం ఆమె నైజం. అయితే ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పోతినేనితో నిధి అగర్వాల్ జతకట్టింది. ఈ సినిమా సూపర్ హిట్. ఆపై తమిళంలో భూమి, ఈశ్వరన్ అనే చిత్రాలు చేసింది. అవి ఆడలేదు. మరలా టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ హీరో లో నటించింది. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది వసూళ్లు మాత్రం రాలేదు. ప్లాప్స్ లో నిధికి రెండు బంపర్ ఆఫర్స్ రావడం కొసమెరుపు. పాన్ ఇండియా చిత్రాలైన హరి హర వీరమల్లు మూవీలో నిధి మెయిన్ హీరోయిన్. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ పక్కన ఆమెకు ఛాన్స్ రావడం ఊహించని పరిణామం. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆలస్యం అయ్యింది. వచ్చే ఏడాది విడుదల కానుంది.
అలాగే మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ మూవీలో కూడా ఆమె ఓ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే పరిశ్రమలో ఎదగడంపై ఆమె కొన్ని కీలక కామెంట్స్ చేశారు. స్కిన్ షో చేసిన వాళ్ళకే అవకాశాలు ఉంటాయని అన్నారు. హీరోయిన్ గా ఎదగాలంటే ఎక్స్ పోజ్ చేయడం తప్పనిసరి అని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే స్క్రిప్ట్ సెక్షన్ లో కూడా ఏమీ ఉండదు. అంతా లక్. పేపర్ మీద అద్భుతం అనుకున్న కథలు వెండితెరపై తేలిపోతాయి. సాదాసీదా అనుకున్న కథలు సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేస్తాయని ఆమె అన్నారు. ఇటీవల వేణు స్వామితో నిధి ప్రత్యేక పూజలు చేయించుకుంది.