నటుడు వినాయగన్ తన అపార్ట్మెంట్లో మద్యం మత్తులో గొడవ చేశాడంటూ ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదును విచారించిన పోలీసులు నటుడిని ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. విచారణను ఎదుర్కొనేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వినాయగన్ స్టేషన్లోనూ పోలీసుల ఎదుటే నినాదాలు చేసి గందరగోళం సృష్టించారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కేకలు వేశారు.
అయితే వర్త్ వర్మ వర్త్.. ఈ డైలాగ్ వినగానే మీ ‘జైలర్’ సినిమాలో విలన్ గుర్తొస్తాడు. మూవీలో విలనిజంతో అదరగొట్టిన నటుడు వినాయకన్‌ని కేరళ పోలీసులు నిజంగానే అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఏం జరిగింది.. కేరళకు చెందిన నటుడు వినాయకన్.. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాలు కూడా చేస్తున్నాడు. తాజాగా మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించాడట.
కొందరు అతడిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ.. అతడు వినకపోగా వారిని ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ ఇబ్బంది పెట్టాడట. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఇక వినాయకన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకుళంలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే వినాయకన్ ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుందని కొందరు ఆరోపిస్తున్నారు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ ‘అసాధ్యుడు’లో సెకండ్ విలన్‌గా నటించాడు.