పవన్ కళ్యాణ్ వేదిక దగ్గరకి వచ్చే సమయానికి.. చుట్టూ అభిమానులతో ఒక గందరగోళ తోపులాట జరిగింది. ఈక్రమంలో అక్కడే ఉన్న కొడాలి నాని కింద పడిపోయే పరిస్థితి జరిగింది. ఈ తోపులాటలోనే మరో రాజకీయనేత వల్లభనేని వంశీ కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాపు నేత, స్వర్గీయ వంగవీటి మోహన రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, పుష్పవల్లి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహం కృష్ణా జిల్లాలోని పోరంకిలోని ఎం రిసార్టులో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వివాహానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, తోట చంద్రశేఖర్, ఎంపీ కేశి నేని నాని ఇతర వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు హాజరయ్యారు.
విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారిన వంగవీటి రాధా, పుష్పవల్లీ వివాహానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, నేతలు తరలివచ్చారు. దాంతో భారీగా తొక్కిసలాట, తోపులాట చోటు చేసుకొన్నది. వేదికపైకి అందరూ ఒకేసారి రావడంతో కొంత గందరగోళం నెలకొన్నది. జనాన్ని కంట్రోల్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్, గన్‌మెన్లకు కష్టంగా మారింది.