గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అటు పెళ్లిళ్ల సీజన్, ఇటు పండుగ కావడంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వారికి బంగారం ధరలు షాకిస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250 తగ్గి రూ. 56,350 వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,450గా ఉంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,600కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 56,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది.ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది. నిజామాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,350కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,450గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,450గా ఉంది.
