సింగర్ గీతా మధురి విడాకులు..! అసలు విషయం తేల్చి చెప్పిన భర్త నందు.

సింగర్ గీతా మాధురి.. యాక్టర్ నందు జంట కూడా ఉంది. అయితే ఇలా హ్యాపీగా ఉండే సెలబ్రిటీ జంటల్లో కొంత మంది మాత్రం మనస్పర్ధలు వచ్చి విడిపోవడం కూడా చూస్తూనే ఉన్నారు. ఈమధ్య పెద్ద పెద్ద స్టార్ కపుల్స్ సడెన్ గా విడిపోయి..విడాకులు తీసుకుని.. షాక్ ఇచ్చారు. అందులో నాగచైతన్య, సమంత జంట తో పాటు.. ధనుష్ జంట లాంటి స్టార్ కపూల్స్ విడిపోవడం పెద్ద షాక్. అయితే గత రెండేళ్ల నుంచి గీతామాధురి నందు ఇద్దరు విడిపోతున్నారని,

వీరి మధ్య గొడవలు రావడం వల్ల గీత మాధురి తన పాపని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందని,నందు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడని, అందుకే ఇద్దరు కలిసి ఏ ఫంక్షన్ లో కూడా జంటగా కనిపించడం లేదు అని ఇలా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నందు హీరోగా, సహాయ పాత్రల్లో రాణిస్తూ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. అంతేకాదు రీసెంట్ గా రష్మి హీరోయిన్ గా నందు హీరోగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆ సినిమా పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. ప్రస్తుతం మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నెగటివ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు నందు.

ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి నందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విడాకులు రూమర్లకు చెక్ పెట్టేశారు. గత రెండు సంవత్సరాల నుంచి మేము విడిపోతున్నాం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాగే మేము చాలా రోజుల నుంచి రియాల్టీ షోలకి కూడా వెళ్లడం లేదన్నారు. కానీ మేము విడిపోతున్నాం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఇవి పుకార్లు మాత్రమే అని కుండ బద్దలు కొట్టాడు. దీంతో ఇన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేశారు నందు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *