అప్పారావు డ్రైవర్ స్కూల్, ఆనందమానందమాయే, విశాఖ ఎక్స్ ప్రెస్, యమదొంగ, తేజమ్ చిత్రాల్లో ఐటెమ్ సాంగులు చేసింది. కానీ ఈ బ్యూటీ తెలుగులో త్వరగానే ఫేడౌట్ అయ్యింది. కానీ బాలీవుడ్లో మంచి జోరు చూపించింది. అక్కడ పెద్ద సినిమాలు చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో క్యూట్ అందాలతో మెరిసిన ఈ భామ.. బాలీవుడ్లో మాత్రం గ్లామర్ షోతో పిచ్చెక్కిచ్చింది. నార్త్ ఆడియెన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చింది.
దాదాపు 13ఏళ్ల గ్యాప్లో నలభై సినిమాలు చేసిన ఈ భామ ఉన్నట్టుండి సినిమాలకు దూరమయ్యింది. అయితే తాజాగా ఆమె సినిమాలకు దూరమవడానికి గల కారణాలను వెల్లడించింది. ‘నేను కోరుకున్న రోల్స్ నాకు రాలేదు. నాకు వచ్చిన పాత్రలతో నేను సంతోషంగా లేను. సినిమాలో కీలకమైన పాత్ర చేయాలని ఉండేది. అలా అని సినిమాలో నేనే హైలైట్ అవ్వాలని చెప్పడం లేదు. కనీసం కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలంటున్నాను. అదే నేను కోరుకుంది. కానీ అటువంటి పాత్రలు నా దాకా రానేలేదు.

అలాంటప్పుడు ఏదో ఒకటి నేను నిరాశకు లోనవడం, నా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని ఒక అడుగు వెనక్కు వేశాను. విక్టోరియా నెం.203 తర్వాత నేను ఏ హిందీ సినిమా చేయలేదు, కానీ పలు ప్రాంతీయ భాషల్లో నటించాను. ఈవెంట్లు, షోలు.. ఇలా చాలా చేశాను. కాబట్టి సినిమాలకు నేను దూరంగా ఉన్నానని ఎప్పుడూ ఫీలవలేదు. కాకపోతే బాలీవుడ్ చిత్రాల్లో నటించడాన్ని మిస్ అయ్యాను. ఇప్పుడు నేను తిరిగొచ్చేశాను, మళ్లీ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను. సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది ప్రీతి జింగానియా.
