రకుల్ ని పెళ్లి చేసుకునే ఛాన్స్ కోల్పోయిన మంచు లక్ష్మి. స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పు.

స్వలింగ సంపర్కం.. నగరాలకో, సంపన్న వర్గాలకో పరిమితం కాదని.. వివాహ చట్టంలో మార్పు అవసరమా కాదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. అయితే, స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంచు లక్ష్మి స్పందించారు. అయితే భారతదేశానికి ఓ సంస్కృతి ఉంది. వివాహ వ్యవస్థ అంటే సమాజంలో గౌరవం, విలువ ఉన్నాయి. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమని తీర్పు వెలువరించింది.

ఈ తీర్పు పై మంచు లక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలు చట్టబద్దం చేయడం కుదరని తీర్పు ఇవ్వడంతో నా గుండె బద్దలైంది. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసిన దేశం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకపోవడం సిగ్గు చేటు… అంటూ ట్వీట్ చేసింది. అయితే మంచు లక్ష్మి ట్వీట్ పై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయం, విలువలు దృష్టిలో ఉంచుకొని కోర్ట్ తీర్పు ఇచ్చింది.

దీనికి మీరెందుకు బాధపడుతున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మీకెంతుకు అంత బాధ. మీరు ఎవరినైనా అమ్మాయిని వివాహం చేసుకుందామని అనుకున్నారా? అని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు. ఓ నెటిజెన్ అయితే… స్వలింగ వివాహం చట్టబద్ధం చేస్తే రకుల్ ప్రీత్ ని వివాహం చేసుకునేదానివా అంటూ కౌంటర్ వేశాడు. మంచు లక్ష్మికి ఓ లేడీ గ్యాంగ్ ఉంది. వారిలో రకుల్ ప్రీత్ ఆమెకు అత్యంత సన్నిహితం. ఈ క్రమంలో పెళ్ళైన మీరు పెళ్లి కాని రకుల్ ప్రీత్ ని వివాహం చేసుకుందాం అనుకున్నారా? అందుకే మీ గుండె బద్దలయ్యిందా అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *