కాజల్.. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. పెళ్లై ఓ బిడ్డకు జన్మించిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో అదరగొడుతోంది. అంతేకాదు పెళ్లికి ముందు తరహాలోనే క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.
అయితే హిరోయిన్స్ రకరకాల వింత వ్యాధులకు గురైనట్లు చెప్పుకొచ్చారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు ఓ వింత జబ్బు ఉంది అనే విషయాన్ని బయట పెట్టింది . ఎంత డైట్ చేసినా.. ఎన్ని వర్కౌట్స్ చేసినా.. తన బాడీకి ఏం కాదట.
ఫుడ్ తిన్న కూడా బరువు పెరగదట. ఒకవేళ తాను ఏవైనా పనుల్లో పడిపోయి మూడు రోజులు నాలుగు రోజులు జిమ్ కి వెళ్ళకపోతే మాత్రం బీభత్సంగా బరువు పెరిగిపోతుందట . అది తగ్గడానికి సుమారు పది రోజుల కష్టపడాల్సి వస్తుందట . అందుకే ఎన్ని పనులు ఉన్న జిమ్ మాత్రం మానను అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చింది కాజల్. దీంతో ఇది కూడా ఓ వింత వ్యాధి అని జనాలు ఫన్నీ గా కామెంత్స్ చేస్తున్నారు.