అరుదైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రేణు దేశాయ్‌.

చాలామందిలో చిన్నతనం నుంచి కనిపించే మయోకార్డియల్ బ్రిడ్జ్ సమస్య రేణు దేశాయ్‌కి ఇటీవల బయటపడిందట. కొంచెం నడిస్తే ఆయాసం, హార్ట్ రేట్ పెరగడం, ఒక రకమైన ఆందోళన, హార్ట్ అటాక్ వంటి ఫీలింగ్స్ అనిపిస్తాయని రేణు చెప్పారు. మంచి క్యారెక్టర్లు వస్తే సినిమాలు కంటిన్యూ చేస్తానని అయితే ముందు తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని రేణు వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తున్న ఆమె.. తాజాగా తన వ్యక్తిగత జీవితం విషయమై బ్లాస్ట్ అయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు.. తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. తన అనారోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్‌ అయింది. ప్రస్తుతం తాను గుండె సంబంధింత వ్యాధితో బాధ పడుతున్నట్లు చెప్పి షాకిచ్చింది రేణు. ఇది మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అనే వ్యాధి అని, ఈ వ్యాధి తనకు తన నాన్నమ్మ నుంచి వారసత్వంగా వచ్చిందని చెప్పింది రేణు దేశాయ్. ఇది తనకు పుట్టుకతోనే వచ్చిందని తెలిపింది. తక్కువ ఆహారం తీసుకున్నా కూడా విపరీతంగా బరువు పెరుగుతున్నానని.. దీనికి కారణం ఈ వ్యాధి లక్షణాలు, అలాగే దానికి వాడుతున్న ‘బీటా బ్లాకర్స్’ మెడిసిన్ అని అంటోంది రేణు.

రెగ్యులర్ గా మందులు వేసుకుంటూ ఉండటం వల్ల లావు అవుతున్నా అని ఆమె చెప్పింది. బై బర్త్ వచ్చిన ఈ గుండె సంబంధిత వ్యాధికి బైపాస్ సర్జరీ లాంటివి ఏమీ లేవని, ఇది జీవితాంతం ఉంటుందని చెప్పింది. చాలామంది వైద్యుల్ని కలిశా కానీ.. దీనికి బీటా బ్లాకర్స్ ట్రీట్ మెంట్ ఒక్కటే మార్గం అని చెప్పారని రేణు పేర్కొంది. ఈ వ్యాధితో చాలా ఏళ్లుగా బాధపడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. కొంచెం నడిచినా కూడా అలసట రావడం, హార్ట్ బీట్ పెరగడం, హార్ట్ పెయిన్‌గా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని రేణు దేశాయ్ చెప్పింది. అందుకే హార్ట్‌ బీట్స్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేయటానికి యాపిల్‌ వాచ్‌ వాడుతున్నానని ఆమె చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *