డాక్టర్ రాజశేఖర్, జీవిత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరో, హీరోయిన్లుగా కెరీర్ మొదలు పెట్టి, ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మొదలై, పెళ్లి వరకు వెళ్లింది. అయితే, తమ ప్రేమ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయట. తాజాగా వెన్నెల కిషోర్ హోస్టుగా చేస్తున్న ‘అలా మొదలయ్యింది’ షోలో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు పాల్గొన్నారు. తమ సినిమా కెరీర్ తో పాటు, ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అయితే పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి 17వ మెట్రోపాలిటన్ కోర్టు యేడాది జైలు శిక్ష పాటు రూ. 5 వేల జరిమానా విధించింది. జీవిత, రాజశేఖర్ దంపతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2011లో రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తోన్న బ్లడ్ బ్యాంక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు అభిమానుల నుంచి రక్తాన్ని ఉచితంగా సేకరించి బయట మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.
దీనిపై చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ అప్పట్లో ఈ విషయమై జీవిత, రాజశేఖర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా చిరంజీవి పేరుతో నడుస్తోన్న ట్రస్టు మరియు సేవా కార్యక్రమాలపై అసత్య ఆరోపణలు చేసారంటూ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఎన్నో ఏళ్ల విచారణ అనంతరం నాంపల్లిలోని 17వ మెట్రోపాలిటిటన్ కోర్టు వీరిద్దరికి యేడాది జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధించింది. అంతేకాదు ఈ కేసుపై అప్పీలుకు వెళ్లేందుకు ఛాన్స్ ఇస్తూ షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.