82 ఏళ్ల వయసులో జిమ్‏లో వర్కౌట్స్, యాంకర్ సుమ ఏం చేస్తుందో చుడండి.

టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ యాంకర్‏గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఏ సినిమా ఈవెంట్ అయినా.. ప్రమోషన్ ఇంటర్వ్యూస్ అయినా సుమ ఉండాల్సిందే. అంతగా అభిమానులను సొంతం చేసుకున్నారు సుమ. ఇప్పుడు యూట్యూబ్‏లోనూ సొంత ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అయితే మలయాళీ అమ్మాయి అయినా తన మాటలతో, షోలలో తన కబుర్లతో,

ఈవెంట్స్ లో తన వాగ్దాటితో దాదాపు గత 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ తెలుగు వారిళ్ళల్లో ఒక ఆడపడుచు అయ్యింది యాంకర్ సుమ కనకాల. ఇప్పుడు కూడా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు సినిమాలు, యూట్యూబ్.. వీటితో పాటు ఫ్యామిలీ అంటూ ఫుల్ బిజీగా ఉంది సుమ. సుమ గతంలో అనేకసార్లు వాళ్ళ అమ్మని ప్రేక్షకులకు పరిచయం చేసింది. వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోలు, చేసిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది సుమ. సుమ వాళ్ళ అమ్మకి ఇప్పుడు 82 ఏళ్ళు. ప్రస్తుతం సుమతో పాటు వాళ్లింట్లోనే ఉంటున్నారు.

తాజాగా సుమ వాళ్ళ అమ్మకి సంబంధించిన ఓ వీడియో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. సుమ వాళ్ళ అమ్మ జిమ్ లో థ్రెడ్ మిల్ పై నడుస్తుంది. 82 ఏళ్ళ వయసులో ఆమె థ్రెడ్ మిల్ పై ఫాస్ట్ గా నడవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఈ వయసులో ఆమె ఇంకా అంత ఆరోగ్యంగా ఉన్నారంటే గ్రేట్ అని, అసలు ఆమె 82 ఏజ్ లాగే కనిపించట్లేదని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుమ ఈ వీడియో షేర్ చేసి.. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే అందుకు మా అమ్మే కారణం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *