పెళ్లి అయిన తర్వాత మహిళలు ఎందుకు లావు అవుతారో తెలుసా..?

పెళ్లికి ముందు ఆడపిల్లలు డైట్, వ్యాయామం చేస్తూ బరువుని కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ఎందుకంటే తనకు కాబోయే భర్తకు నచ్చాలని ఆరాటపడుతారు. కానీ వివాహం అయిన వెంటనే వారు తమ డైట్‌ని వదిలిపెడుతారు. రిలాక్స్ అవుతారు. ఇన్ని రోజులు చేసిన డైట్‌ ఒక్కసారిగా వదిలివేయడంతో ఆ ఎఫెక్ట్‌ శరీరంపై పడుతుంది. దీంతో బరువు పెరుగుతారు. అయితే వివాహం ఇద్దరికి ఎంతో సంతృప్తిని ఇచ్చేదిగా ఉంటుంది. అందుకే పెళ్లి తరువాత చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు. పెళ్లికి ముందు ఎంత సన్నా ఉన్నా వివాహం తరువాత బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తారు.

ఎంత బక్కగా ఉన్న వారైనా పెళ్లి తరువాత ఒళ్లు చేయడం మామూలే. మహిళలు పెళ్లి తరువాత ఎందుకు బరువు పెరుగుతారు? అని అందరిలో ఓ ఆలోచన వస్తుంది. జీవిత భాగస్వామిని చేసుకున్న సంతోషంలో మహిళలు భవిష్యత్ పై బెంగ లేకుండా తమ భర్తతో కలిసి సుఖంగా సంసారం చేసుకోవాలని సంతోషంతో ఉంటారు. పెళ్లికి ముందు సన్నగా ఉన్నవారు సైతం కాస్త లావై బొద్దుగా కనిపించడం చూస్తుంటాం.

లావుగా ఉన్న వారు మరింత బొద్దుగా మారుతారు. వివాహానికి ముందు కష్టపడి పనిచేసేవారు పెళ్లికి ముందు పనులు ఆపేస్తారు. దీంతో వారు లావుగా మారతారని తెలుస్తోంది. ఇక వివాహం జరిగి జీవితంపై భరోసా ఏర్పడటంతో పుష్టిగా తిని కాస్త ఒళ్లు పెంచుకుంటారని మరో వాదన ఉంది. వివాహానికి ముందు చదువుకోవడం వల్ల కూడా ఎంతో ఆతృత ఉంటుంది. జీవితంపై బెంగ ఉంటుంది. ప్రస్తుతం ఆ స్థితి పోవడంతో మహిళలు లావుగా మారతారని కూడా తెలుస్తోంది.

వివాహం తరువాత ఇంట్లో అందరు తిన్నాక తినే అలవాటు ఉండటంతో చివరికి మిగిలిపోయిన పదార్థాలను వృథాగా పడేయడం ఇష్టం లేకపోవడంతో వాటిని తినేందుకు మొగ్గు చూపుతుంది. దీంతో కాస్త ఒళ్లు చేయడం పరిపాటే. ప్రతి మహిళ వివాహం తరువాత రెండు కిలోల వరకు బరువు పెరుగుతుందని తెలుస్తోంది. పెళ్లికి ముందు ఇంకా కొన్నిపనులు చేసే మహిళ ఇంటికే పరిమితమై పనులు చేసుకుంటూ ఉంటుంది. అందుకే బరువు పెరుగుతుందని చాలా మంది చెబుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *