సితార గొప్ప మనసు, ఆ మంచి పనికోసం మొదటి రెమ్యునరేషన్‌ మొత్తం ఇచ్చేసిన సితార.

ప్రముఖ జ్యువెలరీ సంస్థకు ప్రచారకర్తగా ఆమె వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సంస్థ ప్రచార చిత్రాల్ని విడుదల చేసింది. అగ్ర రాజ్యం అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ఆ యాడ్ ఫొటోల్ని ప్రదర్శించారు. ఆ యాడ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుల్ని సేవకు ఇచ్చినట్లు చెప్పారు. అయితే సితార ఇటీవల పీఎంజే అనే జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించింది.

సితార నటించిన ఈ జ్యువెలరీ యాడ్‌కు సంబంధించిన ఫొటోలను ఏకంగా న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డ్‌ ప్రదర్శించారు. ఇక ఈ ప్రకటనలో నటించేందుకు గానూ సితార కోటి రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకుందని తెలుస్తుంది. అయితే ఈ పారితోషకాన్ని సేవా స్వచ్ఛంద కార్యక్రమాలకు ఇచ్చేసినట్లు తెలిపింది మహేష్ గారాల పట్టి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార తన ఫస్ట్‌ రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను ఛారిటీకి ఇచ్చేసానంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. మహేశ్‌ అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎంతో మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్‌ బాధ్యతలను నమ్రతా దగ్గరుండి మరీ చూసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *