రోజూ మితంగా బీరు తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె జబ్బు ఉన్నవారు కూడా బీర్ తాగవచ్చట. అయితే అది అతిగా తాగకపోవడం మంచిది. ఆల్కహాలిక్ ద్రాక్ష రసం, వైన్ కంటే బీర్లో ఎక్కువ ప్రోటీన్, విటమిన్ బి ఉంటుంది. బీర్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. అయితే ఒత్తిడిని తగ్గిస్తుంది.. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. కానీ బీర్ గురించి పరిశోధనలన్నీ బీర్ మితంగా తీసుకుంటే అది అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.
ఒత్తిడి, భయము, అలసట వంటి వాటి నుంచి బయటపడొచ్చంటున్నారు పరిశీధకులు. కానీ దీనిని 350 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకూడదని కూడా సూచిస్తున్నారు. కిడ్నీలకు ప్రయోజనకరం: బీరు తాగడం వల్ల కిడ్నీలోని స్టోన్స్ పగిలిపోతాయని నమ్ముతారు చాలా మంది. అందులో ఎంత నిజముందో తెలియదు. అయితే, దీని గురించి ఒకసారి నిపుణుడిని సంప్రదించడం అవసరం. చర్మానికి మంచిది.. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేయడానికి ప్రజలు ఎంత డబ్బు ఖర్చు చేస్తారో తెలియదు. అయితే కేవలం బీర్ తాగడం వల్ల మీ చర్మంపై చాలా ప్రభావం ఉంటుంది.
వాస్తవానికి, బీర్లో హాప్స్, ఈస్ట్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరంపై గాయాలను వేగంగా నయం చేస్తాయి. అల్జీమర్స్ తగ్గించేందుకు.. అల్జీమర్స్ సమస్య కారణంగా జ్ఞాపకశక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. చాలా మర్చిపోవడం మొదలవుతుంది. పరిమిత మొత్తంలో బీర్ తాగడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని నమ్ముతారు. బీర్లో ఉండే సిలికాన్, హాప్స్ వంటి మూలకాలు అల్జీమర్స్‌ను నివారించడంలో సహాయపడతాయి.
అల్సర్‌కు ఉపశమనం.. కొన్ని పరిశోధనలు 75 mg అని సూచిస్తున్నాయి. బీర్ తీసుకోవడం ద్వారా అల్సర్ సమస్యలో చాలా ఉపశమనం లభిస్తుంది. ఇది హెచ్. పైలోరీ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కానీ బీర్ పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా నష్టాలను కలిగిస్తుంది.