వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రాలు గమనిస్తే.. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్, ఇప్పుడు తెరకెక్కిస్తున్న వ్యహం చిత్రాలతో సహా అన్ని పొలిటికల్ కాంట్రవర్సీ చిత్రమే. అయితే ‘వ్యూహం’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో జగన్ పై చంద్రబాబు చేసిన కుట్ర అంటూ కొన్ని షాట్స్ చూపించారు.
అలాగే పవన్ కళ్యాణ్ పాత్రను కూడా చూపించారు. ప్రస్తుత ఏపీలో హాట్ టాపిక్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ విషయానికి కూడా ఈ ట్రైలర్లో ప్రస్తావించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతుంది. శ్రీ రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు అజ్మల్ అమీర్ వైయస్ జగన్ పాత్రలో నటిస్తుండగా, వైయస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ చిత్రాలకి వివాదాలు జోడించి ఆసక్తి పెంచడంలో వర్మ స్టయిలే వేరు.