డూప్ లేకుండా ఎత్తైన కొంతమీద నుంచి అమాంతం దూకేశాడు. అయితే కింద అమర్చిన సేఫ్టీ ట్రాక్‌లో కాకుండా వేరేచోట పడిపోయాడు. హీరోగా ఎదుకుగున్న టైంలో జరిగిన ఈ ప్రమాదం నటుడి జీవితాన్ని తలకిందులు చేసింది. తమిళ చిత్ర సీమలో అగ్రహీరోగా ఎదగగలిగిన సత్తా ఉన్న నటుడు బాబు ఈ ప్రమాదం తర్వాత చలనం లేకుండా మంచానికే పరిమితం అయ్యాడు. పూర్తీ వివరాలోకి వెళ్తే కోలీవుడ్ సీనియర్ హీరో బాబు సెప్టెంబర్ 19న మృతి చెందిన విషయం తెల్సిందే.
వెన్నుముక విరిగిపోవడంతో బాబు నడవలేని పరిస్థితి.. అయినా కూడా అతనిని ఎంతో ప్రేమగా చూసుకుంది ప్రేమ. అదే కదా తల్లిప్రేమ అంటే. ఇక దాదాపు 30 ఏళ్లు బాబును చూసుకున్న ఆమె.. కొడుకు చనిపోయాక బతకలేకపోయింది. కొడుకు జీవచ్ఛవంలా ఉన్నా కూడా.. బతికి ఉన్నాడు చాలు అని అనుకుంది. అలానే కొడుకుకు సపర్యలు చేస్తూ వస్తుంది. ఇక కొడుకు చనిపోయాడని తెలిసాకా.. ఆమె తట్టుకోలేకపోయింది. బాబు కోసమే కంటతడి పెడుతూ నిద్రాహారాలు మానేయడంతో ప్రేమ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.

ఈ క్రమంలో అస్వస్థతకు లోనైన ప్రేమ అక్టోబర్ 11న కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ విషయాన్నీ బాబు కుటుంబ సభ్యులు అధికారికంగా తెలిపారు. దీంతో ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అని చెప్పుకొస్తున్నారు. బాబు తన కెరీర్ లో 10 సినిమాల్లో నటించాడు. అతడి మొదటి సినిమా ఎన్ ఉయిర్ తొళన్. ఈ సినిమాకు దర్శక దిగ్గజుడు భారతీరాజా దర్శకత్వం వహించాడు.