ప్రభాస్ తో అనుష్క పెళ్లి సంబంధం, పెళ్లి ఎప్పుడో తెలుసా..?

తమ అభిమాన తారలను తమకు నచ్చిన విధంగా ఎడిట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. ఇక ప్రభాస్‌ అభిమానులు మాత్రం ఓ అడుగు ముందుకేసి ప్రభాస్‌కు పెళ్లి చేసి, పిల్లల్ని కూడా పుట్టించేశారు. ప్రభాస్‌కు పెళ్లి జరిగినట్లు ప్రభాస్‌ కుటుంబం ఇది అంటూ ఏఐ టెక్నాలజీ ద్వారా ఎడిట్‌ చేసి కొన్ని ఫొటోలను నెట్టింట షేర్‌ చేశారు. అయితే అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు అని ఈ మధ్యకాలంలో చాలా మంది వీరి అభిమానులు ప్రభాస్ అనుష్కకి పెళ్ళై కొడుకు పుట్టాడని ఒక ఫోటో క్రియేట్ చేశారు.

ఇక తాజాగా అయితే వీరిద్దరికీ కలిపి ఒక పాప పుట్టింది అని, ఆ పాపను వీరిద్దరూ ఎత్తుకొని కూర్చున్నట్టు ఒక ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఫోటో చూసినా చాలామంది నవ్వుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా అనుష్క తండ్రి ప్రభాస్ ని కలిసారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అనుష్క పేరెంట్స్ ఇద్దరు ప్రభాస్ ని కలిసి తమ కూతురు పెళ్లి విషయాన్ని మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు బట్టి కొంతమంది నెటిజెన్లు వాళ్లకి వాళ్లే ఈ రూమర్లు పుట్టిస్తున్నారు.

ఇక మరి కొంతమంది అయితే అదేమీ లేదు కావచ్చు ప్రభాస్ కి ఈ మధ్యకాలంలో సర్జరీ జరిగింది కాబట్టి ఆయనను పరామర్శించడానికి అనుష్క పేరెంట్స్ వెళ్లారని ఇంకొంతమంది రాసుకొస్తున్నారు.మరి ఈ రెండిట్లో ఏది నిజమో కానీ మెజారిటీ నెటిజన్స్ మాత్రం ప్రభాస్ ని కలవడానికి ప్రధాన కారణం అనుష్క పెళ్లి విషయమే అని, ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోతుండడంతో పెళ్లికి సంబంధించిన విషయం మాట్లాడాలని కలిసారని టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *