చెల్లిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్న శివాజీ ..! తన భార్య గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరో.

ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన శివాజీ.. గత కొన్నేళ్ల నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. రాజకీయాలపై తనకు ఉన్న ఇంట్రెస్ట్‌తోనే సినిమాలను దూరం పెట్టాడని స్పష్టంగా కనిపిస్తోంది. శివాజీ.. రాజకీయనాయకుడు కాకపోయినా.. రాజకీయాలపై ఉన్న ఆసక్తి.. తనను రాజకీయ విశ్లేషకుడిని చేసింది. అయితే ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు బయట చెప్పలేదు. అయితే బిగ్ బాస్ కి వచ్చాక తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. శివాజీ పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ బంధువు కాదట.

ఈయనది గుంటూరు జిల్లా అయితే ఆమెది తెలంగాణ లోని నిజామాబాద్. వీళ్ళ కులాలు కూడా వేరే. ఈయన చౌదరి అయితే ఆమె గౌడ కుటుంబానికి చెందినది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ తోడల్లుడు కూతురు శ్వేతానే శివాజీ పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంట. ఏదో ఫంక్షన్ లో వీరిద్దరూ కలిశారు అది కాస్త ఇలా ప్రేమకు దారితీసింది చివరకు పెళ్లి చేసుకున్నారు. తన భార్య గురించి మాట్లాడుతూ శివాజీ తనని షూటింగ్లకి రావద్దని చెప్పారట.

తనలోకం తనది సినిమాలు షూటింగ్లను పట్టించుకోదు అని అన్నారు. పిల్లలకు కూడా షూటింగ్ తెలియదు నార్మల్ స్కూల్లోనే చదువుకుంటున్నారు లగ్జరీస్ గా కాకుండా వాళ్లని నార్మల్గా పెంచుతున్నాను ఆర్థికంగా పర్వాలేదు మా భార్య ఫ్యామిలీ కూడా ఆస్తి ఉన్నవాళ్లే. ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేవని శివాజీ తెలిపారు. అయితే శివాజీ తనకు బంధువు వరుసైన చెల్లెల్ని లేపికెళ్ళి పెళ్లి చేసుకున్నాడనే వార్తలు రూమర్స్ అని తెలుస్తుంది. వారిద్దరూ కుల మతాలు వేరు. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *