హీరోయిన్ అనుపమతో హీరో రామ్ పెళ్లి, పెళ్లిపై హీరోయిన్ కూడా..?

ప్రేమమ్ తెలుగు రీమేక్ తో తెలుగులో సూపర్ స్టార్ హీరోయిన్‌గా మారింది.ఇప్పటికే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్. అయితే ఇలా నిత్యం వారి చుట్టూ రూమర్స్ సహజీవనం చేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ రూమర్స్ పై వాళ్ళు స్పందిస్తారు. ఇంకొన్నిసార్లు అస్సలు స్పందించడం కూడా వేస్ట్ అని వదిలేస్తూ ఉంటారు. ఇక ఎప్పటినుంచో హీరో రామ్ పోతినేని పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వస్తున్న విషయం తెల్సిందే.

అప్పుడెప్పుడో.. రామ్ తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అవి ఏ రేంజ్ లో వచ్చాయంటే.. రామ్ కుటుంబ సభ్యులు కూడా రామ్ ను నమ్మలేనంతగా. దీంతో ఈ కుర్ర హీరో స్పందించక తప్పలేదు. దయచేసి ఈ పెళ్లి వార్తలు ఆపండి.. నా కుటుంబ సభ్యులే నన్ను అనుమానిస్తున్నారు. నాకే చిన్ననాటి స్నేహితురాలు లేదు అంటూ రామ్ లబోదిబో అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అప్పటి పెళ్లివార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక గత కొన్నిరోజులుగా క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశర్వన్ తో రామ్ పెళ్లి అంటూ మరో పుకారు షికారు చేస్తోంది.

వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే. ఈ రెండు సినిమాలు కూడా ఆశించనంత ఫలితాన్ని అనుకోలేకపోయినా.. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని టాక్. ఇక ఈ విషయమై వీరిద్దరూ స్పందించలేదు లేదు కానీ, అనుపమ తల్లి సునీత మాత్రం ఘాటుగా స్పందించినట్లు టాక్. అందులో ఎటువంటి నిజం లేదని, ఇలాంటి పుకార్లు ఎక్కడనుంచి వస్తాయో తెలియడం లేదని విసుక్కుందని సమాచారం. అనుపమ ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉందని, తనకు పెళ్లి కుదిరితే తామే స్వయంగా చెప్తామని కూడా చెప్పుకొచ్చిందంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *