నీకే చెప్తున్నా..! మా హీరోలను తిట్టడానికి నువ్వెంత నీ స్థాయి ఎంత : హైపర్‌ ఆది

సినిమాల మీద ఇంకా చాలా వరకు కొందరికి చెడు అభిప్రాయం ఉందని అలాంటి వారు సినిమాల్లో మంచిని కాకుండా చెడుని తీసుకుంటాడని అన్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో వారికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ గురించి చెప్పిన హైపర్ ఆది ఏ హీరోని వదిలి పెట్టకుండా దుమ్ము దులిపేశాడు. రూల్స్ రంజన్ సినిమాకు అసలు ఆది ఇచ్చిన స్పీచ్ కి సంబంధం ఏంటన్నది కొంతమందికి అర్థం కాదు. కానీ చివరగా సినిమా వల్ల మంచే జరుగుతుంది కానీ చెడు జరగదని చెప్పాడు హైపర్ ఆది.

చిత్ర పరిశ్రమపై విమర్శలు పెరిగిన నేపథ్యంలో ఇటీవల జాతీయ అవార్డులు సాధించిన వారిని చూపిస్తూ, వారిని అభినందిస్తూ, ఇదే విమర్శలు చేసే వారికి సమాధానం అని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చిన అవార్డులను చూసి ఇకనైనా విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అదే సమయంలో సినిమాల్లో చూసి చెడు చేస్తున్నారనే దానికి హైపర్‌ ఆది సమాధానం చెప్పాడు. సినిమా ఎప్పుడు మంచే నేర్పించిందని, చెడు ఎప్పటికీ నేర్పించదు, సినిమాల్లో చెడుని కాదు, మంచిని స్వీకరించాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి నుంచి కుర్రహీరోల వరకు అందరి గొప్పతనం చెప్పాడు. పల్లెటూరు నుంచి నగరానికి వచ్చి ఆయన్నే దేవుడిగా కొలిచే స్థాయికి ఎదగిన పెద్ద ఎన్టీఆర్‌ను చూసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నేర్చుకోండని, అలాగే విజయం ఎంత ముఖ్యమో, వినయం అంతే ముఖ్యమని 90 ఏళ్ల జీవితం, 75 ఏళ్ల నటన జీవితం ఉన్న ఏయన్నార్‌ను చూసి నేర్చుకోవాలని చెప్పారు హైపర్‌ ఆది. అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాలు తీసి ఈ రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన,

నిర్మాతకు నష్టం వస్తే డబ్బులు తిరిగిచ్చే మంచి మనసున్న కృష్ణగారిని చూసి నేర్చుకోవాలని, అలాగే ఇంటికి వచ్చింది శత్రువు అయినా అన్నం పెట్టి మాట్లాడాలనే సంస్కారాన్ని కృష్ణం రాజుని చూసి నేర్చుకోవాలని, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకుని చూపించి, ఎవరికైనా పెట్టే స్థితిలో ఉండాలి కానీ నెట్టే స్థితిలో ఉండకూడదని చెప్పి బతికినంతకాలం రాజులా బతికిన శోభన్‌బాబుని చూసి నేర్చుకోవాలన్నారు. తెలుగు సినిమాలో ఏదైనా పాత్ర దక్కితే చాలనుకుని తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరిన మెగాస్టార్‌ చిరంజీవి చూసి నేర్చుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *