పులిపిర్లు మెడ భాగంలో, ముఖం మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి.అంతేకాకుండా శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా పులిపిర్లు వస్తాయి. ఈ పులిపుర్లను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిరి కాయలు వస్తాయి.పాదాలపై పులిపిర్లు వస్తే పెద్దగా సమస్య ఉండదు. కానీముఖం, మెడపై వస్తేనే కాస్త అసహ్యంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది.దీంతో ఈ పులిపిరి కాయలను తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.
అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే సులువుగా ఈ సమస్యను నివారించుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పులిపిర్లకు చెక్ పెట్టడంలో అరటి పండు తొక్క గ్రేట్‌గా సహాయపడుతుంది. చిన్నఅరటి పండు తొక్క తీసుకుని. రాత్రి నిద్రించే ముందు పులి పిరి ఉన్న చోట పెట్టి బ్యాండేజ్ వేయాలి. ఇలా ప్రతి రోజు చేస్తే క్రమంగా పులిపిర్లు తగ్గు ముఖం పడతాయి. అలాగే పులిపిర్లను సహజ సిద్ధంగా నివారించడంలో యాపిల్ సిడర్ వెనిగర్ కూడా అద్భుతంగా సహాయపడుతుంది.
యాపిల్ సిడర్ వెనిగర్ లో దూదుని ముంచి పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల పులి పిర్లు ఫాస్ట్ గా తగ్గిపోతాయి. ఇక బేకింగ్ పౌడర్‌తో కూడా పులి పిరి కాయలను తగ్గించుకోవచ్చు. అందుకు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ మరియు ఆముదం వేసి బాగా మిక్స్ చేయండి. రాత్రి నిద్రంచే ముందు పులి పిర్లు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి. ఉదయాన్ని గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే. పులిపిర్లు సమస్య దూరం అవుతుంది.