ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయిన సుచి లీక్స్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది.ఇంటర్వ్యూలో భాగంగా రేష్మ మాట్లాడుతూ. అప్పట్లో సంచలనం సృష్టించిన ఘటన గురించి ఆమె స్పందించింది.స్టార్ హీరో హీరోయిన్లపై పగబట్టిన సింగర్ సుచిత్ర వారి ప్రైవేటు వీడియోలను ఫోటోలను సుచి లిక్స్ పేరుతో అకౌంట్ ని ఓపెన్ చేసి రిలీజ్ చేసింది. అయితే సింగర్ గా పాపులర్ అయి.. ఒక్క సారిగా సోషల్ మీడియా లో సెన్సేషన్ అయిపోయారు సుచిత్ర. కోలీవుడ్ సెలబ్రిటీల ప్రైవేసీ అండ్ సీక్రెట్ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేసి ఓవర్ నైట్ హాట్ టాపిక్ మారారు. ఆ సెలబ్రిటీలందర్నీ ఒక్క సారిగా పరిగెత్తించారు.
చెమటలు పట్టేలా.. చేశారు. సైబర్ సెల్ చుట్టూ తిరుగుతూ.. తమ లీకుడు వీడియోలను సోషల్ మీడియా నుంచి తీయాలని వేడుకునేట్టు చేశారు. అయితే ఆ వీడియోల కారణంగా తన కెరీరే నాశనం అయిపోయిందని ఇప్పుడు మరో సారి తన ఆవేదన వ్యక్తం చేశారు కోలీవుడ్ హీరోయిన్ రేష్మ. ఆవేదన వ్యక్తం చేయడమే కాదు.. ఆనాటి ఘటనను గుర్తు చేసుకుని ఏడ్చేశారు. ఇప్పటికీ తాను ఆ జ్ఙాపకాల నుంచి కోలుకోలేకపోతున్నా అన్నారు. ఎస్ ! తమిళ్ నాడులో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీలో పుట్టిన రేష్మ.. తాను కాలేజీలో ఉండగానే.. బుల్లి తెరపై యాంకర్ గా పాపులర్ అయ్యారు.
ఆ తరువాత సీరియళ్లు సినిమాలు చేస్తూ.. కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. క్రేజీ క్రేజీ ఫిల్మ్ ఆపర్చునిటీస్తో… టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా కూడా మారిపోయారు. ఇక ఈ క్రమంలోనే సుచి లీక్స్‌లో.. తన పేరుతో ఓ వీడియో రిలీజ్ అవ్వడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.ఆ వీడియోలో ఉన్న అమ్మాయి రేష్మలాగే ఉండడం… అది కూడా ఓ వ్యక్తితో బెడ్ పై సన్నిహితంగా ఉండడం.. అప్పట్లో టాక్ ఆఫ్ ది సౌత్ గా మారింది. తన కెరీర్ పై మాయని మచ్చేసింది. తనకొచ్చిన సినిమా ఛాన్స్లన్నీ వెనక్కి వెళ్లేలా చేసింది. తన కెరీర్‌ను నాశనం చేసింది. దాంతో పాటే.. ఫ్యామిలీలో తనకు క్యారెక్టర్ లేనిదానిగా మిగిల్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వీడియోలో ఉంది తాను కాదని..అది మార్ఫింగ్ వీడియో అని వాధిస్తున్న రేష్మ పసుపులేటి.. తాజాగా ఓ ఇంటర్య్వూలోనూ అదే చెప్పారు. ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట మరో సారి వైరల్ అవుతున్నారు.