బిగ్ బాస్ లో బ్యాంకాక్ పిల్ల..? ఎలా తెలిసిందో తెలుసా..?

ప్రస్తుతం బిగ్ బాస్ మేకర్స్.. హౌస్ లోకి ఎవర్ని పంపించాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. సినిమా, టీవీ, సోషల్ మీడియాల్లో సెలబ్రెటీ స్టేటస్ తెచ్చుకున్నవాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఇంకేముంది ఇప్పుడే సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సీజన్ 7 చర్చ షూరు అయ్యింది. ఈ షో ఎప్పుడు స్టార్ట్ కానుంది ?..కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు ? అనే విషయాల గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.

ఇప్పటికే ఫలానా వాళ్లు షోలో అడుగుపెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ జాబితాలో వినిపిస్తోన్న పేరు బ్యాంకాక్ పిల్ల. ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెట్టింట ఎక్కువ సమయం గడిపే వాళ్లకు పరిచయం అవసరం లేని పేరు బ్యాంకాక్ పిల్ల. థాయ్‏లాండ్ దేశంలోని బ్యాంకాక్ లో నివసించే ఆమె.. అక్కడి జీవన విధానం.. ఆహారపు అలవాట్లు అన్నింటిన తన విజయనగరం యాసలో చెప్పేస్తుంటుంది. బ్యాంకాక్ పిల్ల అసలు పేరు శ్రావణి సమంతపూడి.

ఆమె యూట్యూబ్ ఛానల్ కు రెండు మిలియన్స్ కు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు. విజయనగరానికి చెందిన ఆమె బ్యాంకాక్ లో తన యాసలో అనేక వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే బ్యాంకాక్ రాబోతున్నానని చెప్పింది. దీంతో ఆమె బిగ్‏బాస్ కోసమే ఇండియాకు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే నిజాంగానే బిగ్‏బాస్ సీజన్ 7లో బ్యాంకాక్ పిల్ల ఉంటుందా ?.. అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *