పాచి పనులు చేస్తూ అంజలి లైఫ్ లో ఎన్ని కష్టాలు పడిందో చూస్తే కన్నీళ్లు ఆగవు.

అంజలికి చాలా రోజులుగా సరైన హిట్ లేదు. ఏడేళ్ల తర్వాత చేసిన గీతాంజలి తర్వాత అంజలికి చెప్పుకునే సక్సెస్ కూడా రాలేదు. లాస్ట్ మూవీ నిశ్శబ్ధం అయితే అంజలిని విమర్శల్లో పడేసింది. పోలీస్ ఇన్ స్పెక్టర్ క్యారెక్టర్ కు అస్సలు సెట్ కాలేదనీ.. లుక్ కూడా బాగోలేదనే కామెంట్స్ వచ్చాయి.

ఈ కామెంట్స్ ఆమెను మరింత కుంగదీశాయి. అయితే తెలిసో, తెలియకో చేసిన ఒక నిర్వాకం హీరోయిన్ అంజలికి సీత కష్టాలు తెచ్చిపెడుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఏ ముహూర్తంలో ఆమె సీత పాత్ర వేసిందో కాని అంజలి జీవితం అంతా వివాదాలమయం కాబోతోందా అనిపిస్తోంది.

అజ్ఞాతంలోకి పోయి పిన్నిని, డైరెక్టర్ కళైంజయం ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సినీ వినీలాకాశంలో ఓ సంచలన తార అవుతామనుకుంది అంజలి. వారిద్దరు బిచ్చగాళ్లు అయినట్టు పిన్ని, డైరెక్టర్ కళైంజయం తన సంపాదన మెక్కి బతుకుతున్నారంటూ దుమ్మెత్తి పోసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *