తండ్రితో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఏదో తెలుసా..?

చిరంజీవి తండ్రి వెంకట్రావు గారికి నటనపై ఎంతో ఆసక్తి ఉండడంతో చిరంజీవి గారితో కలిసి వెండితెరను పంచుకున్నారు.అప్పట్లో చిరంజీవి నటించిన “జగత్ కిలాడీలు“అనే చిత్రంలో చిరంజీవితో కలిసి నటించారు.ఆ తరువాత కుటుంబ బాధ్యతల నేపథ్యంలోనూ, వెంకట్రావు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి ‘మగధీర’, ‘బ్రూస్లీ’, ‘ఖైదీ నంబర్ 150’ ఆచార్య’ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో ‘మగధీర’ ‘బ్రూస్లీ’ సినిమాల్లో రామ్ చరణ్ హీరో అయితే.. చిరంజీవి ఈ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు.

మరోవైపు చిరు కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో రామ్ చరణ్..అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటలో రామ్ చరణ్ అతిథిలా మెరిసాడు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ యేడాది వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో ‘ఆచార్య’ సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. కానీ ఈ సినిమా అభిమానులను నిరాశ పరిచింది. అటు చిరంజీవి తన కుమారుడు చరణ్‌తో కాకుండా..తమ్ముళ్లైన నాగబాబు, పవన్ కళ్యాణ్‌‌లతో పాటు బామ్మర్ధి అల్లు అరవింద్.. వారి అబ్బాయి అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇంత మంది ఫ్యామిలీ మెంబర్స్‌తో తెరను పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తన తండ్రిగారైన వెంకట్రావు గారితో ఓ సినిమాలో నటించారు. కానీ చిరంజీవి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాకా.. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో చిరు తండ్రిగారైన వెంకట్రావు గారు కూడా యాక్ట్ చేసారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో దర్శకుడు బాపు గారు మంత్రి గారి వేషం వెతుకుతూ ఉంటే… అల్లు రామలింగయ్యగారు వెంట్రావు గారి పేరును బాపు గారికి సజెస్ట్ చేశారట.

‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో చిరంజీవికి ఆయన తండ్రి గారైన వెంకట్రావు మధ్య ఎలాంటి డైలాగులు కూడా లేవు. కనీసం తెరపై ఒకేసారి కూడా వీరిద్దరు కనపడలేదు. కానీ తన పెద్దబ్బాయి చిరంజీవి యాక్ట్ చేసిన ఓ సినిమాలో యాక్ట్ చేసానన్న సంతృప్తి మాత్రం వెంకట్రావుగారికి మిగిలింది. ఈయన నాగబాబు నిర్మాణంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘బావగారూ బాగున్నారా.., ‘స్టాలిన్’, ‘గుడుంబా శంకర్’ ‘ఆరెంజ్’ వంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *