నీ యమ్మ అంటూ సైమా ఈవెంట్లో వ్యక్తిని కొట్టిన మంచు లక్ష్మి, వీడియో వైరల్.

తెలుగు ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తుండగా ఓ వ్యక్తి కెమెరాకు అడ్డుగా వచ్చాడు. వెంటనే రియాక్ట్ అయిన మంచు లక్ష్మి తప్పుకో అన్నట్లు అతని భుజం మీద కొట్టింది. నీ యమ్మా అంటూ అసహనం వ్యక్తం చేసింది. అంతలోనే మరొక వ్యక్తి కూడా అడ్డుగా వచ్చాడు. అయితే తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది. అందుకు కారణం ఆ వీడియోలో మంచి లక్ష్మి ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడమే.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం దుబాయ్ వేదికగా సైమా అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే కదా. దక్షిణ భారతదేశానికి చెందిన చాలామంది సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మంచి లక్ష్మి కూడా సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదిక బయట మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాకు అడ్డంగా వెళ్లడంతో కోపంగా ఆ వ్యక్తి వీపు మీద కొట్టింది. ఆ తర్వాత కెమెరా వైపు తిరిగి మాట్లాడుతుంటే మరో వ్యక్తి అడ్డు వచ్చాడు. దాంతో కోపంగా “డ్యూడ్ కెమెరాకు అడ్డు రాకుండా ఉండాలనేది మినిమం బేసిక్స్” అంటూ మంచు లక్ష్మి అతనిపై ఫైర్ అయింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే వీరిలో చాలామంది మాత్రం మంచి లక్ష్మి ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన సైమా అవార్డు ఫంక్షన్ లో బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *