సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సాయి పల్లవి..! అసలు నిజం ఇదే.

ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు పడి పడి లేచే మనసు, విరాటపర్వం వరకు ఎన్నో చిత్రాల్లో నటించింది. అయితే విరాటపర్వం తర్వాత మరో సినిమాలో ఇప్పటివరకు కనిపించలేదు. అయితే తాజాగా సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందని, అందుకే నటనకు దూరమైందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి పెళ్లి దండలతో ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారింది.

అయితే అనూహ్యంగా సాయిపల్లవి ఇప్పుడు పెళ్లి చేసుకుంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో మెడలో దండలు వేసుకొని మరొక వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామిని సాయి పల్లవి పెళ్లి చేసుకుంది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అని తేలిపోయింది. శివ కార్తికేయన్ తో కలిసి ఆమె నటిస్తున్న SK 21 ముహూర్తం పూజ ఇటీవల నిర్వహించారు మేకర్స్.

ఆ పూజా కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు రాజకుమార్ సాయి పల్లవి మెడలో వేరువేరుగా పోలదండలను వేసుకుని ఉన్నారు. అయితే ఆ ఫోటోలని కొంతమంది సోషల్ మీడియాలో పెళ్లి చేసుకున్నారు అంటూ వైరల్ చేయడం ప్రారంభించారు. అసలు పెళ్లి ఫోటోలు కాదు అని సినిమా వేడుకల్లో తీసింది అని తాజాగా సాయి పల్లవి తో విరాటపర్వం చేసిన దర్శకుడు వేణు సైతం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *