జగన్ కుమార్తెలు హర్ష రెడ్డి, వర్ష రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా..?

జగన్ పెద్ద కుమార్తె వైఎస్ హర్షారెడ్డికి మంచి అకాడమిక్ రికార్డ్ ఉంది. 2017లో ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేరింది. ఎకనమిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. అమెరికాలోని ఓ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌లో ఉద్యోగానికి ఎంపికైంది. అయితే తండ్రి ముఖ్యమంత్రి, తాత కూడా అప్పట్లో ముఖ్యమంత్రి. ఇలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎంత గారాబంగా పెరుగుతారు, ఎంత హంగు, ఆర్భాటాలతో ఉంటారో మనం ఊహించగలం. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.

అసలు వారిద్దరూ ఎక్కడుంటారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారనే విషయం అతి కొద్దిమంది కుటుంబ సన్నిహితులకు మినహా ఇంకెవరికీ తెలియదు. వారి చిన్నప్పటి ఫొటోలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి కానీ, ఇప్పుడు వారు ఎలా ఉన్నారనే విషయం ఎక్కడ వెదికినా కనిపించదు. అంత లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు జగన్ కుమార్తెలు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడా వారి హడావిడి కనిపించదు. కారణం చదువు, చదువు, చదువు. వారికి చదువే లోకం, చదువే వారి ప్రపంచం. కుమార్తెలను కలిసేందుకు జగన్, ఆయన సతీమణి భారతి.. ఇప్పుడు ప్యారిస్ పయనమవుతున్నారు.

ఫ్రాన్స్ లోని ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి జగన్ పెద్ద కుమార్తె వైఎస్ హర్షా రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వారి యూనివర్సిటీ కాన్వొకేషన్ జులై 2న జరుగుతుంది. జగన్ దంపతులు ప్యారిస్ లో జరిగే ఈ కాన్వొకేషన్ కి హాజరవుతున్నారు. తిరిగి జులై 3న వారు విజయవాడకు వస్తారు. సీఎం జగన్ కు ఇద్దరు కుమారైలు. పెద్ద కుమార్తె పేరు హర్ష రెడ్డి, జగన్ అత్తమ్మ ఆమెకు హర్ష అని పేరు పెట్టారు. రెండో కుమార్తెకు అక్క పేరు కలిసొచ్చేలా వర్ష అని పెట్టుకున్నారు. ఇద్దరూ చిన్నప్పటినుంచి చురుకైనవారు. చదువంటే పంచ ప్రాణాలు. తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వీరిద్దరికీ మంచి చనువు ఉంది. వైఎస్ఆర్ ఎక్కడికెళ్ళినా పిల్లలకు మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇస్తుండేవారు. అలా వారికి పుస్తకాలపై ఆసక్తి, పుస్తక పఠనం అలవాటయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *