ఎంబీబీఎస్ పూర్తి చేసిన శివాని రాజశేఖర్.. రాజశేఖర్, జీవితల వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2018లో ‘2 స్టేట్స్’ సినిమాలో హీరోయిన్గా నటించారు. అయితే పెద్ద హీరోలు, హిట్ సినిమాల్లో నటించకపోయినా హీరో కూతురు అనే ట్యాగ్ లైన్లో అవకాశాలు దక్కించుకుంటోంది శివానీ రాజశేఖర్. తండ్రి బాటలో డాక్టర్ చదువుతూ మరోవైపు యాక్టింగ్ వైపు ఫోకస్ పెడుతోంది.
సోదరి శివాత్మిక,శివానీ ఇద్దరూ పోటీ పడి మరీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’ సినిమా విషయానికొస్తే.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాలో మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు తల్లి, తండ్రికి తగ్గ తనయగా ప్రూవ్ చేసుకుంది శివానీ రాజశేఖర్.
ఇక శివాత్మిక విషయానికొస్తే.. జీవిత రాజశేఖర్ డాటర్ అనే ట్యాగ్ లైన్తో దొరసానిలా ప్రేక్షకుల ముందుకొచ్చింది శివాత్మిక. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది. విలక్షణ కథలను ఎంచుకుంటూ తన రోల్కి ప్రాధాన్యమున్న పాత్రలకు ఓకే చెబుతోంది.