గుడ్డు తినే వారు పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. ప్రాణాలకే ప్రమాదం.

గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందనేది నిజం. కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, మన శరీరానికి అత్యవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. మితంగా సోడియం కూడా ఉంటుంది. అలాగే రాగి, అయోడిన్, ఐరన్, మాంగనీస్, సెలీనియం, జింక్ లభిస్తాయి. అందుకే గుడ్లను పోషకాహారంగా చెబుతారు. దీనిలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందనేది మాత్రం నిజం కాదు.

శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి రోజుకో గుడ్డు తింటే సరిపోతుంది అని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఒక రోజులో ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాహారం అందడంతో పాటు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉండదు. అయితే గుడ్డును చీజ్, బేకన్, మెఫిన్, ఎగ్ పఫ్ ఇలాంటి రూపంలోకి మార్చుకొని తింటే మాత్రం సంతృప్త కొవ్వులు అధికంగా శరీరంలో చేరే అవకాశం ఉందని హార్వర్డ్ ఆరోగ్య నివేదిక చెబుతుంది.

కాబట్టి గుడ్డును కేవలం గుడ్డుగానే తినాలి. అంటే ఉడకబెట్టిన ఒక గుడ్డును, వేరే పదార్థాలు చేర్చకుండా తినడం వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ ఆహారంలో చేరదు. బోస్టన్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో వారానికి ఐదు గుడ్లు తింటే సరిపోతుందని తెలింది. ఇలా మితంగా గుడ్లు తినడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్, డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుందని అధ్యయనం చెబుతోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ఒక గుడ్డు 78 క్యాలరీలను అందిస్తుంది. అలాగే ఆరు గ్రాముల ప్రోటీన్ ను కూడా ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *