ప్రేమ అనేది ఎందుకు ఎప్పుడు ఎలా కలుగుతుందో చెప్పలేము. ఇలా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడు వారి ప్రేమ కొద్ది రోజులు బాగుంటుంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి లేదా అబ్బాయి బ్రేకప్ చెప్పేస్తారు. దాంతో వారు ప్రేమించిన వ్యక్తి మోసం చేశారని బాధపడుతుంటారు. వారికి ఏం చేయాలో తెలియక దిగ్భ్రాంతి చెందుతారు. వారి బాధను ఇతరులతో చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తారు.
ఇలా వారి మనస్సు మరింత గాయపడుతుంది. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక ఆ బాధ నుంచి బయటకు రాలేక సతమతమవుతుంటారు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు మొదట్లో వారి ప్రేమ సాఫీగా నడుస్తుంది. కొన్ని రోజుల తరువాత వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడుతాయి. ఈ మనస్పర్థల కారణంగా వారి ప్రేమ బ్రేకప్ అవుతుంది. ఎవరి దారి వారు చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకరు హ్యాపీగా ఉంటారు.
మరొకరు బాధపడుతుంటారు. వారి బాధకు కారణం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని. మనం ప్రేమించిన వ్యక్తి మోసం చేశారు అంటే తనకు కావలసింది తను తీసుకొని తన అవసరం తీరాక వదిలి వెళ్ళిపోయాడు అని అర్థం. కానీ వారు మీ స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోలేదు. అలాగే తనకు కావలసినది నీ దగ్గర లేదని అర్థం. తనకు కావలసింది మనం ఇవ్వలేక పోయినప్పుడు మనం ఫెయిల్యూర్ అయినట్టు అర్థం. ఈ ఫెయిల్యూర్ మనకు జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది.