దశాబ్ద కాలంపాటు తమిళ టాప్ హీరోయిన్ స్థానం రాధికదే. అందం ఆమెకు ప్లస్ పాయింట్. అభినయం ఆమెకు ఎక్స్‌ట్రా పాయింట్.వెండితెరపై రాధిక అన్ని రకాల పాత్రలూ చేసి పోషించింది. ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఈజీగా పరకాయ ప్రవేశం చేయగల అద్భుత నటీమణుల్లో ఆమె ఒకరు. అయితే తాను సరైన సమయంలో రాజకీయాలలోకి వస్తానని ప్రముఖ సినీ నటి రాధిక అన్నారు.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రాధిక తన కుటుంబ సభ్యులతో సోమవారం రాత్రి తిరుమలకు వచ్చారు. భర్త శరత్ కుమార్, కుమారుడితో ఆమె తిరుపతి వచ్చారు. ఆమె కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. విరామ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడారు.
రాజకీయమంటే తెలివితేటలు ఉండటంతో పాటు తగిన సమయం కేటాయిస్తేనే విజయం సాధించగల్గుతామని ఆమె అభిప్రాయపడ్డారు. శరత్ కుమార్ మాట్లాడుతూ.. కూడన్‌కుళం అణు విద్యుత్ ప్రాజెక్టు ద్వారా తమిళనాడులో మరో నాలుగు నెలలో విద్యుత్ కొరత సమస్య తీరనుందని చెప్పారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత పాలన అద్బుతంగా ఉందని కొనియాడారు.