ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తన కూతురు పల్లవికి కులాంతర వివాహం జరిపించారు. ఆ యువతి ప్రేమించిన పవన్ అనే యువకుడితో సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో ఈ పెళ్లి చేశారు. అయితే వార్డు మెంబర్ స్థాయి నుంచి చిన్నచితకా నాయకులంతా వారి కుటుంబంలో వివాహాలు అంటే అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటే లాగా చేస్తుంటారు. రాజకీయ పలుకుబడిని చూపిస్తూ తమ హవా ఏంటో చుట్టుపక్కల వారికి చూపించే ప్రయత్నం చేస్తారు.
కానీ ఈ ఎమ్మెల్యే తన కూతురు వివాహాన్ని నిరాడంబరంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని చాలా నిరాడంబరంగా చాలా సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ వివాహం చేసి కన్న కూతురుపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తన కూతురు పల్లవితో వచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారిద్దరికీ వివాహాన్ని జరిపించారు.
ముందుగా పొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో తాళి కట్టించి దైవ శాస్త్ర ప్రకారం వివాహం జరిపించారు. అనంతరం వారి వివాహాన్ని రిజిస్టర్ చేసేందుకు గాను పొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ వారి వివాహాన్ని రిజిస్టర్ చేయించి వివాహ పత్రాన్ని అందించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిరాడంబరంగా నా పెద్ద కుమార్తెకు కులాంతర వివాహం జరిపించానని, చదువుకునే సమయం నుంచి ఓ యపవకుడిని ప్రేమించానని నా కుమార్తె చెప్పిందని, ప్రెమించిన వ్యక్తితోనే జీవితం బాగుంటుందని నా బిడ్డ చెప్పడంతో కులం , మతం , డబ్బు చూడకుండా వారికి నిరాడంబరంగా వివాహం చేశానన్నారు.
ఆడంబరంగా వివాహం చేస్తాను అని తన కూతురికి చెప్పిన అలాంటిదేమీ వద్దు నేను సామాన్యురాలిగా చాలా నిరాడంబరంగానే వివాహం చేసుకుంటానని తన కుమార్తె చెప్పిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.