తాను నడిచొచ్చిన ప్రయాణాన్ని తనదైన మాటల్లో చెప్తూ.. అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇదంతా ఎవరో హీరో గురించి కాదు.. మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురించే. అయితే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జన్మదిన వేడుకలు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ త్రైలోక్య మోహన్ చండీ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి-కల్పన దంపతులు గోపూజ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మంత్రితో కేక్ కట్ చేయించారు.
ఘనంగా మంత్రిని సన్మానించి , జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లోని అనాథ, వృద్ధాశ్రమాల్లో అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహణ, ఆలయాల్లో పూజలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు.