ఎట్టకేలకు అసలు విషయం ఓపెన్ గా చెప్పిన సమంత.

సమంత హీరోయిన్‌గా చేసిన 17 సినిమాలు అమెరికాలో వన్ మిలియన్ సాధించాయి. విజయ్ కెరీర్‌లో ఖుషి నాలుగోవ సినిమాగా నిలిచింది. ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే.. అమెరికాలో మహేష్ సినిమాలు 11 వన్ మిలియన్ సాధించాయి. ఆ తర్వాత నాని- 8, ఎన్టీఆర్- 7, పవన్ కళ్యాణ్- 7, అల్లు అర్జున్- 5 ప్రభాస్- 5, చిరంజీవి -4, విజయ్ దేవరకొండ -4 సినిమాలతో అదరగొడుతున్నారు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ తో కలిసి సందడి చేసింది.

ఆ తర్వాత అమెరికా వెళ్లి, అక్కడ కూడా స్పెషల్ ప్రోగ్రామ్ లు చేసి తనకు వీలైనంత వరకు ప్రమోట్ చేసింది. కానీ, మూవీ మేకర్స్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. కొంత మంది సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, కొందరు మాత్రం అస్సలు బాలేదన్నారు. అయితే, మూవీ టీమ్ మాత్రం సక్సెస్ మీట్స్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ లో సమంత కూడా పాల్గొంటుందని తెలుస్తోంది. ఇప్పటికే సమంత అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చేసింది అని ప్రచారం కూడా జరుగుతోంది.

నిజానికి సమంత అమెరికా వెళ్లింది మూవీ ప్రమోషన్స్ కోసం కాదు. తన మైయోసైటిస్ చికిత్స తీసుకోవడానికి. దాని కోసమే ఆమె, ఎలాంటి కొత్త సినిమాలు కూడా ఒప్పుకోకుండా, సంవత్సరం పాటు బ్రేక్ తీసుకుంది. అయితే, అక్కడ చికిత్స తీసుకుందో లేదో కూడా తెలీదు, అప్పుడే హైదరాబాద్ కి వచ్చేసిందని తెలుస్తోంది. మళ్లీ చికిత్స కోసం అమెరికా వెళ్తుందేమో తెలీదు. కానీ, ప్రస్తుతం ఈ సక్సెస్ మీట్ కి సమంత పాల్గొంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. సక్సెస్ మీట్ తర్వాత ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ లో సమంత హాజరౌతుందా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *