మరోసారి తండ్రి కాబోతున్న రాజమౌళి, అసలు విషయమేంటంటే..?

నార్వే టూర్ కి వెళ్ళిన రాజమౌళి అక్కడినుంచి తన భార్యతో గడుపుతున్న ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.. కొంతకాలం టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన జక్కన్న భార్య రమాతో పాటు సుదూర ప్రాంతమైన నార్వే దేశానికి వెళ్లి అక్కడ అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. అయితే రాజమౌళి మొదట పెళ్లి అయిన రమా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట రమకి మ్యూజిక్ డైరెక్టర్ తో పెళ్ళై ఒక కొడుకు పుట్టాక విడాకులు అయ్యాయి.

ఆ తర్వాత రమా ని రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రమా కి అంతకు ముందే కార్తికేయ అనే కొడుకు ఉన్నాడు. అలాగే కార్తికేయ కోసం రాజమౌళి మళ్లీ రమతో పిల్లల్ని కూడా కనలేదు. అలాగే మయూకా అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతున్నాడు. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అదేంటంటే రాజమౌళి తండ్రి కాబోతున్నాడు అనేది నిజమే.

కానీ రమా రాజమౌళి ప్రెగ్నెంట్ కాదు. అయితే రాజమౌళి ఒక అనాధ అమ్మాయిని దత్తత తీసుకోబోతున్నారట. ఈ విధంగా రాజమౌళి మరోసారి తండ్రి కాబోతున్నారు అంటూ ఓ న్యూస్ వినిపిస్తోంది.అయితే ఆడపిల్లలు అంటే ఉన్న ఇష్టంతో రాజమౌళి మరో అమ్మాయిని దత్తత తీసుకొని పెంచబోతున్నట్లు ఇండస్ట్రీ లో వార్త షికారు చేస్తుంది.. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఏది నిజమో తెలియాలంటే జక్కన్న చెప్పేవరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *