గొప్పింటి అమ్మాయితో పెళ్ళికి రెడీ అయిన ప్రభాస్. పెళ్లి ముహూర్తం ఇదే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్థాయి నుంచి కూడా దాటి నాలుగు పదుల వయసు కూడా వచ్చేసింది ప్రభాస్ కి. కానీ.. తన పెళ్లి విషయంపై మాత్రం ఇప్పటి వరకు ప్రభాస్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడూ హాట్ టాాపిక్‌నే. తాజాగా మరోసారి మన డార్లింగ్‌ పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన పెళ్లి గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండగా ఇప్పుడు మరోసారి ఆయన పెళ్లి వార్త తెర మీదకు వచ్చింది. ఆయన పెళ్లి ఈ ఏడాదే అని అంటున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ అంటే బిరుదు కూడా అందుకున్నాడు. ఇక సినిమాల ద్వారా కాకుండా తన వ్యక్తిత్వం కారణంగా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్నాడు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆయన పెళ్లి ఎప్పుడు చేసుుంటాడు? ఎవర్నీ చేసుకుంటాడు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన వదలకుండా ఫాలో అవుతారు. ప్రభాస్ వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. దీంతో త్వరలో అతడు పెళ్లి చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఎన్నో రూమర్లు కూడా పుట్టుకొచ్చినా ఒక్క రూమర్ కూడా నిజం కాలేదు. మొన్నామధ్య కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లెప్పుడంటే ప్రభాస్ చేసుకున్నప్పుడంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు కూడా కాస్త సైలంట్ అయిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *