జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరంగా మారిందని ఎంత సేపూ ప్రశ్నించే వారిని వేధించడం ,అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. అయితే గురువారం తెల్లవారుజాము. సమయం సుమారు 1.30 గంటలవుతోంది. సివిల్ డ్రెస్‌లో వచ్చిన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు.. దాచేపల్లిలోని టీడీపీ గురజాల నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొప్పుల నాగేశ్వరరావు నివసిస్తున్న అపార్టుమెంటు గోడ దూకారు. నాగేశ్వరరావు ఉండేది ఇక్కడేనా అని వాచ్‌మెన్‌ను అడుగుతూనే..
కొందరు పై అంతస్థుకి వెళ్లి నాగేశ్వరరావు ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు. నాగేశ్వరరావు తలుపు తీయగానే పోలీసులు ఆయనను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. మీరెవరని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నా.. సమాధానం చెప్పకుండానే నాగేశ్వరరావును బలవంతంగా జీపులో ఎక్కించారు. వచ్చింది ఎవరో? ఎందుకు తీసుకెళ్లారో? తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనతో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు, టీడీపీ శ్రేణులకు సమాచారం ఇచ్చారు. చివరికి నాగేశ్వరరావును పిడుగురాళ్ల పోలీ్‌సస్టేషన్‌లో ఉంచినట్టు తెలుసుకున్న యరపతినేని ఫోన్‌లో పోలీసులతో మాట్లాడారు.
వెంటనే విడిచిపెట్టకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈలోగా పార్టీ కార్యకర్తలు స్టేషన్‌కు చేరుకున్నారు. ఎట్టకేలకు ఉదయం 11 గంటలకు నాగేశ్వరరావుకు 41ఏ నోటీసులు ఇచ్చి స్టేషన్ నుంచి పంపారు. ఈ ఘటనపై సీఐ పీవీ ఆంజనేయులు మాట్లాడుతూ 2021, 2022లో అనుమతులు లేకుండా టీడీపీ చేపట్టిన ధర్నాల్లో నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది పాల్గొనడంతో కేసు నమోదయిందని, దీనిపై 41ఏ నోటీసులు ఇచ్చేందుకే నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.