నన్ను క్షమించాలంటూ ఆ డైరెక్టర్ కాళ్లపై పడ్డ లైలా, అసలు ఏం జరిగిందో తెలుసా..?

90లోనే నటి లైలా సినిమాల్లోకి వచ్చింది. క్యూట్ హీరోయిన్ గా, అమాయకంగా వెండితెరపై గుర్తుండిపోయే సినిమాలు చేసి దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తొలుత హిందీ ఫిల్మ్ ‘దుష్మన్ దునియా కా’ అనే చిత్రంలో కథానాయికగా చేసింది. అయితే ఎగిరే పావురమా అనే సినిమాతో తెలుతెరకు పరిచయమై కుర్రాళ్ళ గుండెల్లో పావురంలా ఎగిరిపోకుండా తిష్టవేసుకుని కూర్చుండిపోయింది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఇక్కడే కాకుండా తమిళ్ లో సూర్య, అజిత్, విజయ్ లతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.

ఇక కెరీర్ పీక్స్ లు ఉన్న సమయంలోనే ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. అప్పుడు అంటే సోషల్ మీడియా, ఇలా బ్రాడ్ మైండ్ మైండ్ లేదు తరువాత కూడా నటించలేకపోయారు చాలామంది హీరోయిన్లు. ఇక ఇప్పడు చిత్రపరిశ్రమ అందరిని అక్కున చేర్చుకోవడంతో అప్పటి భామలు ఇప్పుడు రీఎంట్రీలు ఇస్తూ మంచి అవకాశాలను అందుకుంటున్నారు. లైలా కూడా అలాగే రీ ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ లాంటి షోస్ కు వచ్చి అభిమానుల దృష్టిలో పడ్డ లైలా.. సర్దార్ లాంటి స్టార్ హీరో సినిమాలో చేసి హిట్ అందుకుంది.

ఇక ప్రస్తుతం శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్పుకొచ్చింది. తమిళ్ లో లైలాకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన సినిమా నందా. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు బాలా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆమె నటన బాగాలేదని.. బాలా నిత్యం కోప్పడేవారట. సరిగ్గా నటించమని, హావభావాలు మంచిగా పెట్టమని చెప్పేవారట. ఇక చాలారోజులు బాలా కోపాన్ని ఓర్చుకున్న లైలా ఒకరోజు సెట్ లోనే అందరి ముందు అరిచేసిందంట.. ” నేను ఈ సినిమా చేయను.. ఎప్పుడు నామీద అరుస్తూనే ఉంటారు.

నేను వెళ్ళిపోతాను అని అందరిముందు అరిచా.. వెంటనే అక్కడ ఉన్నవారు వచ్చి బాలా గారి గురించి ఎంతో బాగా చెప్పారు. ఆయన డైరెక్షన్ లో నటిస్తే మంచి పేరు, గుర్తింపు వస్తాయని, బాలా గారు చాలా మంచి మనిషి అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మొదటిరోజు థియేటర్ కు వెళ్లి.. నన్ను నేను తెరపై చూసుకొని నేనే షాక్ అయ్యాను. అక్కడ వాళ్ళందరూ.. నన్ను చూసి చప్పట్లు కొట్టి.. అరుస్తూ ఈలలు వేయడం చూసి షాక్ అయ్యాను. వెంటనే బాలాగారి దగ్గరకు వెళ్లి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *