స్టార్ నిర్మాతతో అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్, అసలు విషయమేంటంటే..?

అనుష్క శెట్టి ఓ వైపు అగ్ర హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సత్తాచాటారు. ‘అరుంధతి’ సినిమాతో అనుష్క రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపై బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు స్వీటీ ఇమేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆమె వెండితెర మీద కనిపించలేదు.’నిశ్శబ్దం’ అనే సినిమా ద్వారా నేరుగా ఓటీటీ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా, వ్యూస్ పరంగా సౌత్ ఇండియా లో టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చింది.

ఈ చిత్రం తర్వాత ఇప్పుడు ఈమె యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ‘MS శెట్టి..MR పోలిశెట్టి’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా అనుష్క పెళ్లి టాపిక్ ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న అంశం. అంతకుముందు ఈమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్టు, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేస్తునట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్త ని అటు అనుష్క , ఇటు ప్రభాస్ కండించినప్పటికీ సోషల్ మీడియా లో పుకార్లు ఆగలేదు.

ఇప్పుడు అనుష్క శెట్టి పెళ్లి గురించి వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే, ఈమె త్వరలోనే ఒక స్టార్ నిర్మాతని పెళ్లాడబోతుందట. ఆ స్టార్ నిర్మాత కర్ణాటక సినీ పరిశ్రమకి చెందిన వాడని అర్థం అవుతుంది. ఎవరు ఏమిటి అనే విషయం ఇంకా బయటకి రాలేదు కానీ, ఈ ఏడాది లోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు మాత్రం తెలుస్తుంది. ఇంతకీ ఆ లక్కీ ప్రొడ్యూసర్ ఎవరో చూడాలంటూ అభిమానులు తహతహలాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *