పవన్ ముందే రోజాను బండ బూతులు తిట్టిన హైపర్ ఆది..?

ఒకప్పుడు జబర్దస్త్ ద్వారా నాగబాబు రోజా గారికి బాగా దగ్గరైన హైపర్ ఆది వారిపై కూడా కామెడీగా కొన్ని పంచులు వేస్తుండేవారు. నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆది కొంతకాలం పాటు జబర్దస్త్ లోనే ఉన్నాడు. కానీ ఆ మధ్యలో అది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎక్కువ కామెంట్స్ చేయడంతో రోజా సంతృప్తి వ్యక్తం చేసింది అని టాక్ వచ్చింది. అలాగే వారి మధ్య విభేదాలు రావడం వలన హైపర్ ఆది కొంతకాలం పాటు జబర్దస్త్ కు గ్యాప్ కూడా ఇచ్చాడు అని కథనాలు వెలువడ్డాయి. అయితే జబర్దస్త్‌లో హైపర్ ఆది పంచులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన వస్తే చాలు పంచుల ప్రవాహం నడుస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అసలే కరోనా తర్వాత జబర్దస్త్ కమెడియన్లు మంచి కసి మీద కనిపిస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్‌ను ఫైనల్ మాదిరే చూస్తున్నారు. అందుకే పంచులు కూడా అలాగే వస్తున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆదికి పంచ్ కింగ్ అనే పేరు కూడా ఉందాయే. ఆయన ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్స్‌ను తీసుకుని పంచులు రాసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తాజాగా ఈయన వేసిన ఓ పంచ్‌కు రోజా మొహం చిన్నబోయింది. అనుకోకుండా వేసిన పంచ్‌తో షాక్ అయిపోయింది. నోరెళ్లబెట్టి హైపర్ ఆది వైపు చూస్తుండిపోయింది.

తనపైనే అంత పెద్ద పంచ్ వేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది ఈమె. అసలేం జరిగిందంటే.. మొన్నటి జబర్దస్త్ ఎపిసోడ్‌లో ఎప్పట్లాగే మరో స్పూఫ్ చేసాడు ఆది. అందులో ఆయన ప్రేమించుకుందాం రా..లో వెంకటేష్ లిటిల్ హార్ట్స్ సీన్ చేసాడు. ఈ నేపథ్యంలోనే సైకిల్ తీసుకొచ్చాడు. స్టేజిపైకి వచ్చీ రాగానే రోజాను చూసి పేలిపోయే పంచ్ వేసాడు. ఒరేయ్ ఎవర్రా అక్కడ.. వెంటనే రోజా గారికి ఏసి పెంచండి.. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ చేయండి అంటూ హడావిడి చేసాడు. ఎందుకంటే ఆమెకు సైకిల్ చూస్తే చాలు వెంటనే కోపం వచ్చేస్తుందంటూ రాజకీయాలను తన పంచ్‌తో మిక్స్ చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *