గర్భాశయంలో కణతి వల్ల తీవ్రంగా కడుపునొప్పి వచ్చిందని, దీంతో శస్త్రచికిత్స చేయించుకోక తప్పలేదని రాఖీ సావంత్ తెలిపింది. శస్త్రచికిత్స తర్వాత తాను చాలా బలహీనంగా ఉన్నానని, క్రిటికేర్ హాస్పిటల్ జుహులో 4 గంటల పాటు శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించింది. అయితే రాఖీ సావంత్ 1997లో ‘అగ్నిచక్ర’ తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
ఆతర్వాత హిందీ ‘బిగ్ బాస్ సీజన్ 1’ , సీజన్ 14లో కంటెస్టెంట్గా పాల్గొంది. 2014 లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయితే ల కంటే వివాదాల ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది రాఖీ సావంత్. తాజాగా మక్కా యాత్ర నుంచి ముంబైకు తిరిగొచ్చిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె మక్కా యాత్ర అనుభవాలను పంచుకున్నారు. ఇకపై తనను రాఖీ అని పిలవకుండా ఫాతిమా అని పిలవాలని సూచించింది.
అంతేకాదు మెడలో పూలమాల వేసిన ఒక అభిమానిని కూడా అడ్డుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది అధికారిక పత్రాల్లో కూడా రాఖీ సావంత్ తన పేరు మార్చుకుందా? అని మీడియా ప్రతినిధులు అడిగితే.. ‘నేను ఎలా ఉన్నా దేవుడు నన్ను ఇష్టపడతాడు. అందుకోసం ఎలాంటి పత్రాల్లో పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అని అడ్డదిడ్డంగా సమాధానాలిచ్చింది.