16ఏళ్లు కుర్రాడిని చూసి నీతో మేం ఆడలేం అంటూ వణికిపోతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్స్.

భారతదేశానికి చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ అతని కంటే ఎక్కువ అనుభవం, ఉన్నత శ్రేణి ఆటగాడికి వ్యతిరేకంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 35 కదలికల తర్వాత ప్రత్యర్థిని డ్రాగా ముగించేలా చేశాడు. బుధవారం జరిగే రెండు క్లాసికల్ మ్యాచ్‌ల్లోని రెండో గేమ్‌లో కార్ల్‌సన్ తెల్ల పావులతో ఆరంభించి ప్రయోజనకరమైన స్థితిలో ఉంటాడు. సెమీ-ఫైనల్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానాను 3.5-2.5తో ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్‌కు చేరాడు.

అయితే ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ రన్న‌ర‌ప్ ప్ర‌జ్ఞానంద సోష‌ల్ మీడియా వేదిక‌గా అంద‌రికీ ధన్య‌వాదాలు తెలిపాడు. ఫిడే చెస్‌ ప్రపంచ కప్ ఫైన‌ల్లో త‌న విజ‌యం కోసం ఎంతో త‌పించిన ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్ చెప్పాడు. ‘ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచినందుకు, క్యాండిడేట్స్ 2024 పోటీల‌కు అర్హ‌త సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.

మీ అంద‌రి ప్రేమ‌, మ‌ద్ద‌తు పొంద‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నా.అంతేకాదు నా విజ‌యం కోసం ప్రార్ధ‌న‌లు చేసిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌తలు. న‌న్ను అభినందించిన‌, ఆశీర్వదించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. నాకు ఎల్ల‌ప్పుడూ స‌పోర్టుగా ఉండే, నా సంతోషానికి కార‌ణ‌మైన, ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మైన మా అమ్మ‌తో’ అని ప్రజ్ఞానంద త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *